Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు…

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు…

అమరావతి: వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టిన ఘనత ఏపీ సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. గత 4 నెలల్లో 40 లక్షల మంది ఉపాధిని జగన్ ప్రభుత్వం పోగొట్టిందని ఆరోపించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అనేక అవకతవకలు బయటపడుతుంటే ఎందుకు విచారణ జరిపించటం లేదని ప్రశ్నించారు.

టాప్ ర్యాంక్‌లు వచ్చిన వారు మీడియాకు దూరంగా ఉండటం చరిత్రలో తొలిసారి అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని ఆనంద్‌బాబు హెచ్చరించారు. సమస్యలు చెప్పుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితి ప్రజలకు కల్పిస్తున్నారన్నారు. పారదర్శక పాలన అనేది మాటలకే పరిమితమవుతోందని.. కానీ చేతల్లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *