Breaking News
Home / States / Andhra Pradesh / తెలంగాణా సమ్మెతో ఆర్టీసీకి డబుల్‌ ధమాకా

తెలంగాణా సమ్మెతో ఆర్టీసీకి డబుల్‌ ధమాకా

తెలంగాణా సమ్మెతో ఆర్టీసీకి డబుల్‌ ధమాకా
నేడు హైదరాబాద్‌కు 150-180 స్పెషల్‌ బస్సులు
తెలంగాణా ప్రాంతాలకు మరో 40
ప్రయాణికులతో పీఎన్‌బీఎస్‌ కిటకిట
రైల్వేస్టేషన్‌లోనూ రద్దీ
తెలంగాణాలో టీఎస్‌ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఏపీఎస్‌ఆర్టీసీకి ముందే పండగొచ్చింది. సమ్మె కారణంగా తెలంగాణాలో బస్సులు నిలిచిపోవడంతో శనివారం ఒక్క రోజే ఏపీఎస్‌ఆర్టీసీ 130 స్పెషల్‌ బస్సులు నడిపింది. ఈ బస్సులు ఇటు నుంచి కూడా కిక్కిరిసివెళ్లడంతో ఆర్టీసీకి డబుల్‌ ధమాకా ఆఫర్‌ లభించినట్లయింది.

విజయవాడ: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో స్థిరపడిన వారు రాష్ట్రానికి ఎక్కువగా వస్తుంటారు. ఈ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ పండుగ సీజన్‌లో ప్రత్యేక బస్సులను నడుపుతుంటుంది. అయితే తెలంగాణా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఏపీఎస్‌ఆర్టీసీ అదనంగా బస్సులు ప్రారంభించింది. తెలంగాణా నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా శనివారం రికార్డు స్థాయిలో బస్సులను నడిపింది. విజయవాడ నుంచి శుక్రవారం 100 బస్సులను తెలంగాణాకు పంపించగా, శనివారం ఏకంగా 130 బస్సులను పంపారు. సాధారణంగా స్పెషల్‌ బస్సులు ఇటు నుంచి ఖాళీగా వెళ్లి, అటు నుంచి కిటకిటలాడుతూ వస్తుంటాయి. కానీ శనివారం నాటి పరిస్థితి దీనికి పూర్తిభిన్నంగా ఉంది. హైదరాబాద్‌కు బయలుదేరిన 130 స్పెషల్‌ బస్సులు కూడా కిటకిటలాడుతూనే వెళ్లాయి. తెలంగాణా బస్సుల్లో సగం విజయవాడ నుంచే బయలుదేరతాయి. అయితే సమ్మె కారణంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో అక్కడి బస్సులకు రిజర్వేషన్‌ జరగలేదు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నడిపిన 130 స్పెషల్‌ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. శనివారం అటునుంచి వచ్చే ప్రయాణికులను బేరీజు వేసుకుని ఆదివారం 150-180 స్పెషల్‌ బస్సులను హైదరాబాద్‌కు పంపే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు కూడా డిమాండ్‌ ఉండటంతో 40 స్పెషల్‌ బస్సులను భద్రాచలం, కోదాడ తదితర ప్రాంతాలకు నడిపారు.

ఇతర ప్రాంతాలకూ స్పెషల్స్‌
హైదరాబాద్‌కు శుక్రవారం పం పిన 100 స్పెషల్‌ బస్సుల్లో వచ్చిన ప్రయాణికుల కోసం రాజమండ్రి, భీమవరం, అమలాపురం, కాకినాడ, విశాఖ పట్నం ప్రాంతాలకు మరో 60 స్పెషల్‌ బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపారు.
కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో శనివారం కూడా విద్యార్థులు పెద్ద సంఖ్య లో బస్‌స్టేషన్‌కు వచ్చారు. దీంతో అధికా రులు అప్పటికప్పుడు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. విద్యార్థులంతా ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలకు వెళ్లటంతో 20 ప్రత్యేక బస్సులను నడిపారు.

రైల్వేస్టేషన్‌ కిటకిట
దసరా సెలవుల సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో రద్దీ నెలకొంది. ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణా నుంచి ఎక్కువగా దసరా ఉత్సవాల కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో విశాఖపట్నం, హైదరాబాద్‌కు రాకపోకలు విపరీతంగా పెరిగాయి. దసరా రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రకటించిన స్పెషల్‌ రైళ్లకు అదనంగా శనివారం సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌లకు వయా గుంటూరు, విజయవాడ, భీమవరం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ రైళ్లకు సామర్లకోట, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ, చెర్లపల్లి స్టేషన్లలో హాల్ట్‌ కల్పించారు. రద్దు చేసిన చెన్నై-ఎగ్మోర్‌ రైలును పునరుద్ధరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *