Breaking News
Home / States / Andhra Pradesh / రెట్టింపైన టమోటా ధరలు

రెట్టింపైన టమోటా ధరలు

మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌లో సోమవారం టమోటా ధరలు రెట్టింపు అయ్యాయి. నెల రోజుల నుంచి నిన్నటి వరకు కిలో రూ.24 ధర పలికన టమోటాలు సోమవారం కిలో రూ.48కి పెరిగాయి. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పడమటి ప్రాంతాల్లోని టమోటా తోటల్లో కాయలను కోయకుండా రైతులు అలాగే వదిలేశారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం ఉండడంతో పలు మార్కెట్లలో టమోటాలకు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలోని హైదరాబాద్‌లో టమోటాలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. మదనపల్లె మార్కెట్‌లో నెల రోజులుగా నిత్యం 300 టన్నుల టమోటా విక్రయానికి వస్తుండగా, సోమవారం 220 టన్నులు మాత్రమే వచ్చాయి. దీంతో నాణ్యమైన కిలో టమోటా గరిష్ట ధర రూ.48కు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకటో రకం టమోటా కిలో గరిష్టంగా రూ.48, కనిష్టంగా రూ.30 పలకగా, రెండో రకం గరిష్టంగా కిలో రూ.28, కనిష్టంగా రూ.14కు పలికింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *