Breaking News
Home / National / తాగితే… గృహహింస

తాగితే… గృహహింస

స్టాక్‌హోం : మద్యం లేదా మాదకద్రవ్యాల అలావాటున్న పురుషులు… మహిళల మీద గృహ హింసకు పాల్పడే అవకాశం ఇతరులకన్నా ఆరేడు రెట్లు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. స్వీడన్‌లో పదహారు సంవత్సరాలకు సంబంధించిన లక్షలాది వైద్య రికార్డులు, పోలీస్ సమాచారాన్ని విశ్లేషిస్తూ నిర్వహించిన ఈ పరిశోధన వివరాలను ‘ప్లాస్-మెడిసిన్’ అనే ఓ ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు.

మానసిక అనారోగ్యాలు, ప్రవర్తనా లోపాలు ఉన్న పురుషులు కూడా తమ భాగస్వాములపై హింసకు పాల్పడే అవకాశం అధికంగా ఉంటుందని ఈ పరిశోధన గుర్తించింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ సీనా ఫజల్ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. అమెరికా, స్వీడన్, లండన్ కింగ్స్ కాలేజ్‌లకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. పదిహేనేళ్ళకు సంబంధించిన పరిస్థితులు, రికార్డులను ఈ క్రమంలో పరిశీలించారు.

మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం సమస్యలు ఉన్నట్లు వైద్యపరంగా గుర్తించిన 1.40 లక్షల మంది పురుషుల వివరాలను ఇందుకోసం సేకరించారు. వీరిలో… తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్, మాజీ జీవితభాగస్వాములను బెదిరించటం, వారిపై దాడి చేయటం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి కేసుల్లో ఎంత మంది అరెస్ట్ అయ్యారనేది పరిశోధించారు.

మద్యపాన వ్యసనపరుల్లో 1.7 శాతం మంది ఇలాంటి నేరాల కింద అరెస్టయ్యారని గుర్తించారు. అదే వయసులో ఉన్న మొత్తం పురుషుల్లో ఇటువంటి అరెస్టుల సగటుతో పోలిస్తే ఇది ఆరు రెట్లు అధికం.
ఇక మాదకద్రవ్యాల వినియోగం సమస్య ఉన్న పురుషుల్లో అయితే 2.1 శాతం మంది గృహ హింస నేరాల కింద అరెస్టయ్యారని తేలింది. సాధారణ సగటుకన్నా ఇది ఏడు రెట్లు అధికం.

మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగానికి, గృహహింసకు సంబంధం ఉందనేది నిస్సందేహమని ఈ పరిశోధన తేల్చింది. మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించే వారిలో గృహ హింస నైజం అధికంగానే ఉందని.. అయితే.. ఇటువంటి అలవాట్లు లేని వారి సహోదరులతో పోల్చినపుడు ఈ నైజం కొంత తక్కువగా ఉంటుందని ఈ పరిశీలనలో గుర్తించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *