నల్గొండ: మానసిక ఒత్తిడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. నార్కట్ పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ జమీల్‌కు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు నల్గొండలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమ్మెపై ప్రభుత్వ తీరుతో మానసిక ఒత్తిడికి గురయ్యాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
