Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ లేఖ…

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ లేఖ…

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి డి. శ్రీనివాస్ లేఖ రాశారు. కార్మికుల పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని, ఉద్యోగ భద్రత పేరుతో మెడపై కత్తి పెట్టినా కార్మికులు తలవంచ లేదని, ఆర్టీసీ విభజన జరగకముందే ప్రైవేట్‌పరం చేయడం సరికాదని సూచించారు. మీ స్వభావానికి విరుద్ధంగా ఇంత కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే.. ఏదో కుట్ర ఉన్నట్టు అనుమానం కలుగుతోందని లేఖలో డీఎస్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై గుండె రగులుతోందని, ఇకనైనా పంతాలకు పోకుండా కార్మికులతో చర్చలు జరపాలని డీఎస్‌ హితవుపలికారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *