Breaking News
Home / States / Andhra Pradesh / పొంచి ఉన్న వర్షాభావం

పొంచి ఉన్న వర్షాభావం

విశాఖపట్నం: భూతాపం కారణంగా దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని, లేదంటే కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని దీనికి అనుగుణంగా రైతులు కూడా మారాలని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్‌ సూచించారు. వాతావరణ సదస్సుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుతుపవనాల రాకలో మరింత జాప్యం పెరుగుతుందన్నారు. వర్షాభావ, వాతావరణ అసాధారణ పరిస్థితులను తెలుసుకునేందుకు భోపాల్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాల వరకే పరిమితమైన వాతావరణ బులెటిన్‌లను ఈ ఏడాది నుంచి బ్లాక్‌ స్థాయిలో ఇస్తున్నట్టు చెప్పారు. గ్రామస్థాయిలోనూ వాతావరణ బులెటిన్‌లను ఇచ్చేందుకు రూ.450 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *