Breaking News
Home / States / Andhra Pradesh / ఘనంగా జరుగుతున్న దుర్గమ్మ శాకాంబరి ఉత్సవాలు

ఘనంగా జరుగుతున్న దుర్గమ్మ శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వివిధ రకాల కూరగాయలు తీసుకువచ్చి అమ్మవారికి అలంకరిస్తారు. శాకాంబరి అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక వృద్ధురాలు ప్రముఖ టివి ఛానల్ తో మాట్లడుతూ కొండ కింది నుంచి నడుచుకుని, మెట్లెక్కి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అలంకరణ చాలా బాగుందని అన్నారు.

అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరణ చేసినట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ చెప్పారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయానికి అలంకరణ చేశామన్నారు. హైదరాబాద్‌ భాగ్యనగర్‌ మహాంకాళి బోనాల ఉత్సవ కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఈవో కోటేశ్వరమ్మ బోనాలకు స్వాగతం పలికారు.

Check Also

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *