Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

అమరావతి: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం దర్శించుకోనున్నారు. రాష్ట్ర మంత్రులు ఓంకారం వద్ద సీఎంకు స్వాగతం పలకనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శనివారం ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *