Breaking News
Home / States / జోగులాంబ ఆలయంలో వైభవంగా దసరా వేడుకలు…

జోగులాంబ ఆలయంలో వైభవంగా దసరా వేడుకలు…

జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూర్‌ జోగులాంబ దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణతో వెలుగులు విరజిమ్ముతోంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా జోగులాంబ అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *