Breaking News
Home / Lifestyle / Technology / పబ్‌జి ప్రియులకు దసరా బహుమతి…

పబ్‌జి ప్రియులకు దసరా బహుమతి…

ఇంటర్నెట్ డెస్క్: పబ్‌జి ప్రియులకు టెన్సెంట్ గేమ్స్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తున్నది. దసరా లక్కీ డ్రాలో ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా యూజర్లు నిత్యం పబ్‌జి గేమ్‌లో డైలీ మిషన్స్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాత స్పిన్-స్టయిల్ వీల్‌ను తిప్పాలి. అందులో ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను గెలుచుకోవచ్చు. ఈ క్రమంలో ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు తమ పేరు, చిరునామా తదితర వివరాలను ముందుగా ఒక ఫాంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత లక్కీ డ్రాలో గెలిస్తే ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను బహుమతిగా పొందవచ్చు. అలాగే బోట్ ఇయర్‌ఫోన్స్‌ను, ఇతర పబ్‌జి గేమ్ ఐటమ్స్‌ను కూడా ఈ కాంటెస్ట్‌లో గెలుచుకోవచ్చు. ఇక ఈ ఆఫర్ అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Check Also

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

Share this on WhatsAppతమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *