Breaking News
Home / States / అంగన్‌వాడీ టీచర్లకు దసరా కానుక…

అంగన్‌వాడీ టీచర్లకు దసరా కానుక…

హైదరాబాద్: అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కోసం ముందే వేతనాలు విడుదల చేసింది. ఈ మేరకు రూ.83 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా చివరి వారంలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండుగ మొదటి వారంలోనే వస్తుంది. దీంతో వేతనాలు లేకపోవడంతో పండుగ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సంఘం నేతలు మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి పండుగ కోసం వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం పండుగ కోసం అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *