Breaking News
Home / National / జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

దేశంలో ఇవాళ రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్‌, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఇవాళ ఉదయం 6.55 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ఇక కర్నాటకలోని హంపిలో కూడా రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ సెసిమాలజీ కేంద్రం పేర్కొన్నది.

హంపిలో చాలా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ పురాతన నగరంలో ఏడవ శతాబ్ధానికి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. యునెస్కో ఈ నగరాన్ని వారసత్వ సంపదకు చిహ్నంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా పలు చోట్లు ప్రకంపనలు వచ్చినట్లు సెసిమాలజీ అధికారులు వెల్లడించారు. హర్యానాలోని రోహతక్‌లో 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజుల నుంచి ఢిల్లీ ప్రాంతంలో స్వల్ప స్థాయి ప్రకంపనలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *