న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఈ భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయకంపితులయ్యారు. భూకంప తీవ్రత 5.1గా ఉందని, ఇండియా నేపాల్ సరిహద్దుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు, యూపీలోనూ ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు.
