Breaking News
Home / National / హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లాలో సోమవారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. సిమ్లా జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0 గా భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ భూప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో సిమ్లా ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల సిమ్లా జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని హిమాచల్ ప్రదేశ్ అధికారులు చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *