Breaking News
Home / States / Andhra Pradesh / అబ్బురపరచిన విన్యాసాలు

అబ్బురపరచిన విన్యాసాలు

విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం సాయంత్రం తూర్పు నౌకాదళం నిర్వహించిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసారి రక్షణ రంగానికి చెందిన త్రివిధ దళాలు పాల్గొనడం విశేషం. బెంగళూరు వైమానిక దళం నుంచి వచ్చిన సూర్యకిరణ్‌ (మిగ్‌ 29) బృందం గగనతలంలో చేసిన విన్యాసాలు గగుర్పాటుకు గురిచేశాయి. 9విమానాలు ఒక్కొక్కటి 5 మీటర్ల దూరాన ప్రయాణిస్తూ గాలిలో గిరికీలు కొడుతూ గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ చేసిన విన్యాసాలు కేరింతలు కొట్టించాయి. మెరైన్‌ కమెండోలు భూమికి ఆరు వేల అడుగుల ఎత్తులో దూసుకువెళుతున్న డార్నియర్‌ విమానం నుంచి దూకేసి.. పారాచూట్‌ల సాయంతో తీరంలో వేదికపైకి లాఘవంగా దిగడం, ముఖ్య అతిథికి జ్ఞాపికను బహూకరించడం వారి ధైర్యసాహసాలకు అద్దం పట్టింది. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్‌లో వచ్చి రక్షించడం, తీరంలో పొంచి ఉన్న శత్రు సేనలపై దాడి, శత్రు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి సముద్రంలో వారి ఆయిల్‌ నిక్షేపాలను రిమోట్‌ సాయంతో పేల్చివేత.. యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *