Breaking News
Home / Health / ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సులభంగా చెక్….

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సులభంగా చెక్….

హెల్త్ టిప్స్: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చెక్‌పెట్టే సులభమైన మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పీచు పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకున్న వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం బహు స్వల్పమని అమెరికాలోని వేండర్‌బిల్ట్‌ -ఇన్‌గ్రామ్‌ కేన్సర్‌ కేంద్రం శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిని శాస్త్రవేత్తలు ఐదు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రిస్క్ 33 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిలోని పోషక విలువలు జీర్ణాశయంలోని పేగుల్లో ఉండే గట్‌ బ్యాక్టీరియా సామర్థ్యాన్ని పెంచి క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనంలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *