Breaking News
Home / National / బీజేపీ అధ్యక్షుడికి ఈసీ షోకాజ్ నోటీసులు

బీజేపీ అధ్యక్షుడికి ఈసీ షోకాజ్ నోటీసులు

ముంబై : భారతీయ జనతాపార్టీ ముంబై అధ్యక్షుడు మంగల్ ప్రభాత్ లోథాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో మంగల్ ప్రభాత్ మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీజేపీ-శివసేన ఉమ్మడి అభ్యర్థి పాండురంగ్ సకల్ప్ తరపున ప్రచార సభలో పాల్గొన్న మంగల్ ప్రభాత్ మాట్లాడుతూ 1992లో జరిగిన పేలుళ్లు, అల్లర్లకు వాడిన బాంబులు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో తయారు చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆమీన్ పటేల్, ముస్లింలను ఉద్దేశించి ఆరోపించారు. మంగల్ ప్రభాత్ తో పాటు శివసేన నేతలు సక్పాల్, అభిజిత్ గౌరవ్ లకు ఈసీ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *