హైదరాబాద్: బస్ భవన్లో ఈడీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చ జరగగా దీనిపై ఈడీ కమిటీ రెండు రోజుల్లో సీఎంకు నివేదిక ఇవ్వనుంది. రేపు లేదా ఎల్లుండి కార్మికులతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరపనున్నారు. చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని ఈ సమావేశంలో కార్మికులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
