Breaking News
Home / National / జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభం

జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభం

జమ్మూ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్య రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో పాఠశాలలు, కళాశాలలకు ముందు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించారు. అయోధ్య తీర్పు అనంతరం శాంతియుత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలను సోమవారం నుంచి ప్రారంభిస్తామని జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ చెప్పారు. అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో ముందు జాగ్రత్తగా 144 నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సోమవారం విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు.

Check Also

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

Share this on WhatsAppన్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *