Breaking News
Home / Lifestyle / Business / ఆకాశాన్నంటిన కోడిగుడ్ల ధరలు

ఆకాశాన్నంటిన కోడిగుడ్ల ధరలు

కూరగాయలు, చేపల కొరత
పెరిగిన గుడ్ల వినియోగం

ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో కూరగాయలు, చేపల కొరతతో కోడిగుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండుకు అనుగుణంగా కోడిగుడ్లు లభించక పోవడంతో వీటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్కో కోడిగుడ్డు ధర 8 రూపాయలు పలుకుతోంది. సాధారణంగా ముంబై నగరంలో రోజుకు 75 నుంచి 80 లక్షల కోడిగుడ్లను వినియోగిస్తుంటారు. చేపల బ్రీడింగ్ సీజన్ కావడంతో మార్కెట్ లోకి చేపలు తక్కువగా వస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మార్కెట్ కు కూరగాయలు తక్కువగా వస్తున్నాయి. దీంతో నగరంలో కోడిగుడ్ల వినియోగం 75 లక్షల నుంచి 95 లక్షలకు పెరిగింది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కోడిగుడ్లు ముంబై కు వస్తుంటాయి. ఒక్కో కోడిగుడ్డును 4.75 పైసలకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అందిస్తుండగా రిటైల్ వ్యాపారులు దీన్ని 8 రూపాయలకు పెంచి విక్రయిస్తున్నారు. కోడిగుడ్ల ధరలకు రెక్కలు రావడంతో తమ వంటింటి బడ్జెట్ పెరిగిందని గృహిణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Check Also

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ బిన్నీ బన్సల్‌ రాజీనామా

Share this on WhatsAppవ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలే కారణం వెంటనే అమల్లోకి : వాల్‌మార్ట్‌ న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *