Breaking News
Home / States / Andhra Pradesh / ఈజిప్టు ఉల్లి.. ఊరంతా లొల్లి!

ఈజిప్టు ఉల్లి.. ఊరంతా లొల్లి!

నెల్లూరు/ఉదయగిరి: వినియోగదారుడికి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి కాస్త ఉపశమనం కలిగించింది. ఉదయగిరికి కడప ప్రాంతం నుంచి ఓ లారీ ఈజిప్టు దేశానికి చెందిన ఉల్లిపాయలు వచ్చాయి. దానిమ్మ కాయల్లా అవి ఉండటంతో అందరూ ఆసక్తిగా చూశారు. సాధారణంగా ఉల్లిపాయ 50 నుంచి 100 గ్రాముల బరువు ఉంటుంది. కానీ ఈజిప్టు ఉల్లి మాత్రం 250 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉండటంతో ఇదెక్కడి ఉల్లిపాయంటూ నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.70లకు విక్రయిస్తున్నారు. ఈజిప్టు ఉల్లి కిలో రూ.50లకు విక్రయించండంతో ప్రజలు వాటి కొనుగోలుకు ఎగబడ్డారు. కానీ అవి మన ఉల్లి అంతా ఘాటుగా లేవని పలువురు మహిళలు పేర్కొంటున్నారు.

Check Also

ఏపీలో కొత్తగా 1608 కేసులు

Share this on WhatsAppఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *