Breaking News
Home / Featured / కలకలం రేపుతున్న ఎన్నికల కమిషనర్ లేఖ

కలకలం రేపుతున్న ఎన్నికల కమిషనర్ లేఖ

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం పనితీరు చట్టబద్ధంగా ఉండాలంటూ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాసిన లేఖ కలకలం రేపుతోంది. నేతలకు క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన వాదనను రికార్డు చేయలేదంటూ సీఈసీ అరోరాకు లావాసా లేఖ రాశారు. మైనారిటీ అభిప్రాయాలను కూడా రికార్డు చేయాలని లేఖలో లావాసా పేర్కొన్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాలను మాత్రమే రికార్డు చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో ఎన్నికల సంఘం పనితీరుపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావాసా లేఖతో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.

Check Also

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

Share this on WhatsAppబెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *