Breaking News
Home / Politics / 19న ఓటర్ల జాబితా ప్రకటిస్తాం: దాన కిశోర్‌

19న ఓటర్ల జాబితా ప్రకటిస్తాం: దాన కిశోర్‌

హైదరాబాద్‌: ఈనెల 19వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన కిశోర్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలో కేవలం 53 శాతంలోపే ఓటింగ్ నమోదవుతోందని, పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందే ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో వాహనాల తనికీల్లో రూ.19 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు దాన కిశోర్‌ పేర్కొన్నారు.

Check Also

వీఎన్‌ఆర్‌వీజేఐఈటీలో హాకథాన్‌

Share this on WhatsAppహైదరాబాద్: వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ ప్రాంగణంలో ఆదివారం ‘డిజైన్‌2సాల్వ్‌’ పేరిట 36 గంటల పాటు హాకథాన్‌ నిర్వహించారు.. జేఎన్‌టీయూహెచ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *