మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.39 టీఎంసీలుగా ఉంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. 21 గేట్ల ద్వారా 2.31 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
