Breaking News
Home / National / ఇంజన్ ఫెయిల్ అవ్వడంతో ఎమర్జెన్సీ ల్యాండిగ్…

ఇంజన్ ఫెయిల్ అవ్వడంతో ఎమర్జెన్సీ ల్యాండిగ్…

పనాజీ (గోవా) : గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చింది. 6ఈ336 నెంబరు గల ఇండిగో విమానం ఇంజన్ ఫెయిల్ అయింది. విమానం గోవా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇండిగో విమానం ఇంజన్ ఫెయిల్ అయిందని తెలుసుకున్న పైలెట్ విమానాన్ని తిరిగి గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి తిరిగి తీసుకువచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ఇంజన్ ఫెయిల్ అయినపుడు ఇందులో 200 మంది ప్రయాణికులున్నారు. ఇండిగో విమానాన్ని మరమ్మతుల కోసం ఆపి, ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి పంపించామని ఇండిగో అధికారులు చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *