Breaking News
Home / National / ఇక డెబిట్‌ కార్డులపైనా ఈఎంఐలు: ఎస్‌బీఐ

ఇక డెబిట్‌ కార్డులపైనా ఈఎంఐలు: ఎస్‌బీఐ

ముంబై: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. పండగ సీజన్‌లో షాపింగ్‌లో ఖర్చు కోసం డెబిట్‌ కార్డును వాడుకుని.. ఖర్చైన మొత్తాన్ని వాయిదాలుగా (ఈఎంఐలు) చెల్లించవచ్చని ప్రకటించింది. సోమవారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని తెలిపింది. ఆరు నుంచి 18 నెలల మధ్యలో వాయిదాల కాలాన్ని ఎంచుకోవచ్చని, దేశవ్యాప్తంగా 1500 నగరాల్లోని 40 వేలకు పైగా విక్రేతల వద్ద ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇందుకోసం ఏవిధమైన పత్రాలు కానీ, ప్రాసెసింగ్‌ ఫీజును కానీ చెల్లించనవసరం లేదని, ఎంపిక చేసిన బ్రాండ్లపై వడ్డీలేని వాయిదాలు కూడా ఉంటాయని వివరించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *