విజయవాడ: గ్రామసచివాలయ ఉద్యోగాల్లో హార్టీకల్చర్ విభాగంలో అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. విజయవాడ కృష్ణలంక వద్ద సెల్‌టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. ధ్రువపత్రాలు పరిశీలించి కాల్ లెటర్లు పంపిన తర్వాత హార్టీకల్చర్ ఉద్యోగాలకు డిగ్రీలో బీజడ్సీ చేసిన అభ్యర్థులు అర్హులు కాదు అనడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో బీజడ్సీ అభ్యర్థులు కూడా అర్హులని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చారని వాపోతున్నారు.
