Breaking News
Home / National / ఉద్యోగిపై యజమాని దాడి….

ఉద్యోగిపై యజమాని దాడి….

కర్ణాటక: ప్రైవేట్‌ భద్రత సంస్థకు చెందిన యజమాని తన వద్ద పని చేస్తున్న ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. యజమాని సలీమ్‌ఖాన్‌ తన వద్ద పనిచేస్తున్న గార్డుని ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. దీనిని అక్కడే పనిచేస్తున్న సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో నెటిజన్లు సలీం ఖాన్‌పై నిప్పులు కక్కుతున్నారు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే సిబ్బందిని ఎందుకు ఇంత దారుణంగా కొట్టాల్సి వచ్చిందో తెలియటం లేదు. ఈ ఘటన బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్‌ ఆఫీసులో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *