Breaking News
Home / hyderabad / అత్యాచారాలకు ఎన్‌కౌంటర్‌ పరిష్కారం కాదు

అత్యాచారాలకు ఎన్‌కౌంటర్‌ పరిష్కారం కాదు

రాంనగర్‌: మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే 108 మాదిరిగా 181 హెల్ప్‌లైన్‌ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేసి, అన్ని ప్రభుత్వ విధానాలకు అనుసంధానం చేయాలని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య డిమాండ్‌ చేశారు. అత్యాచారాలకు ఎన్‌కౌంటర్‌ పరిష్కారం కాదని పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మంగళవారం మహిళ ట్రాన్స్‌జెండర్‌ సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి మహిళలు, మహిళా సంఘాలతో మాట్లాడే తీరిక లేదన్నారు. భూమిక డైరెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ నేరం చేసిన వారిని న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షించకుండా, మధ్యలోనే చంపడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఆరోపణలు ఉన్న వారిని రక్షించడం చట్టం బాధ్యత అని, చివరగా తీర్పు వచ్చే వరకు దోషులుగా భావించవద్దని అన్నారు. తాము రేపిస్టులను సమర్ధించడంలేదని, ఈ సంఘటన వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత్రి విమల మాట్లాడుతూ మహిళలపై నానాటికి లైంగిక వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కొండవీటి సత్యవతి, జి.ఝాన్సీ, ఉషా సీతామహాలక్ష్మి, ఖలీదా ఫర్వీన్‌, మీరా సంఘ మిత్ర, బండారు విజయ, శాంతి ప్రబోధ, సుజాత, అనురాధ, ఉషా, తేజస్విని, సుమిత్ర మాట్లాడారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *