Breaking News
Home / Crime / బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది మృతి

బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది మృతి

బారాముల్లా : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లా సోపోరీ పట్టణం సమీపంలోని బొమాయి వద్ద కేంద్ర భద్రతా జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మరణించారు. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ కు చెందిన 177,179.82 బెటాలియన్ జవాన్లు, ప్రత్యేక గార్డులు, రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర గాలింపు చేపట్టారు. జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతదేహం లభించింది. ఉగ్రవాదులు వదిలివెళ్లిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *