జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొడుతున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.
