Breaking News
Home / National / కుల్గాంలో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు హతం

కుల్గాంలో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లా కటపోర ప్రాంతంలో భద్రతా బలగాలకూ, ఉగ్రవాదులకు మధ్య శనివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ ప్రాంతంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఏరియా మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న బలగాలు ఆ ఉగ్రవాదులను సైతం ఏరిపారేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రజౌరి జిల్లాలో ఎల్‌ఓసీ వెంబడి శుక్రవారంనాడు ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలుడులో ఒక ఆర్మీ మేజర్, జవాను వీరమరణం పొందినట్టు ఆర్మీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

Check Also

హోలీ వేడుకల్లో విషాదం

Share this on WhatsAppసముద్రంలో అలలకు కొట్టుకుపోయి ఐదుగురి గల్లంతు… యువకుడి మృతదేహం లభ్యం ముంబై : హోలీ వేడుకల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *