Breaking News
Home / National / ఎన్నికల బరిలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్….

ఎన్నికల బరిలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్….

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మహానగరం ముంబైకి చెందిన మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్‌శర్మ దిగుతున్నారు. ప్రదీప్‌శర్మకు శివసేన పార్టీ ముంబైలోని నాలాసోపారా టిక్కెట్ కేటాయించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రదీప్‌శర్మ తన ఆస్తిపాస్తులను రూ. 36.21 కోట్లుగా పేర్కొన్నారు. ప్రదీప్‌శర్మ గత ఏడాది స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌శర్మ తన ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరాస్తుల మొత్తాన్ని చూపినప్పటికీ, చరాస్తులను ప్రకటించలేదు. అక్టోబరు 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదీప్ శర్మతో పాటు షమ్షేర్ ఖాన్ పఠాన్, గౌతమ్ గైక్వాడ్ అనే మరో ఇద్దరు పోలీసు అధికారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *