ఏర్పేడు: తిరుపతిలోని ఏర్పేడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కాగా బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో చుట్టుపట్టక్క ఉన్న పశువుల కాపరులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ముగ్గురు కామాంధులు బాలికను వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పల్లం హరిజనవాడకు చెందిన సాయికృష్ణ, అంకయ్య, వీరస్వామిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
