Breaking News
Home / Uncategorized / ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించిన …

ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించిన …

హైదరాబాద్‌: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడిన ఎస్సై, కానిస్టేబుల్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం విచారించింది. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు ప్రశ్నించారు. వివిధ అంశాలపై వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆదివారం దిశ కుటుంబసభ్యుల వాంగ్మూలం నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం.. తాజాగా ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించింది.

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *