Breaking News
Home / States / టీబీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు….

టీబీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు….

హైదరాబాద్‌: కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీబీ(క్షయ వ్యాధి)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఏటా రాష్ట్రంలో 12 వేల మంది టీబీతో చనిపోతున్నారని, మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా ప్రజల్లో అవగాహన లేదన్నారు. 2025 నాటికి భారత్‌ నుంచి టీబీని తరిమికొట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో అంతకంటే ముందే టీబీని తరిమికొడుదామని, ఆరేళ్ల లోపు చిన్నారులకు నెలకు 30 గుడ్లు ఇస్తున్నామని, గర్భిణులకు గుడ్లు, పాలు, 3 విడుతల్లో రూ. 12 వేలు అందిస్తున్నామని తెలిపారు. మొబైన్‌ వ్యాన్‌లో ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *