Breaking News
Home / National / ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందడుగు

ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందడుగు

డిల్లీ: దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫిషియెన్సీ సేవల సంస్థ(ఈఈఎస్‌ఎల్‌), భారత హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ‘ఈ మొబిలిటీ’ పథకం కింద ఈ రెండు సంస్థలూ హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయనుండగా.. మరోవైపు ఈఈఎస్ఎల్‌ ప్రజలకు సేవలు అందించడానికి పెట్టుబడులతో పాటు, ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళిక, వాటి అభివృద్ధి, ఇన్‌స్టాలేషన్‌ సహా తదితర అంశాలు ఈ సంస్థల ఎంవోయూ పరిధిలోకి వస్తాయి.

ఈ సందర్భంగా ఈఈఎస్‌ఎల్‌ ఎండీ సౌరభ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో దేశమంతా విద్యుత్‌ వాహనాలు పెరిగిపోనున్నాయి. కాబట్టి వాటి అవసరాలకు అనుగుణంగా ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. హైవేలపై వీటి ఏర్పాటు ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేందుకు ప్రజలకు ఆసక్తి పెరగడంతో పాటు.. విద్యుత్‌ వాహనాలనూ కొనేందుకు ప్రజలు ముందుకు వస్తారు’ అని తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *