న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. నాన్ ట్రాన్స్పోర్ట్ ఫోర్‌వీలర్ వాహనాలకు ఈ విధానం అమలవుతుందని, ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి విధానంలో వాహనాలు రోడ్డు ఎక్కాల్సి ఉంటుండగా ఆదివారాలు మినహాయింపు ఇస్తున్నారు. ఈ విధానాన్ని ఉల్లంఘిస్తే 4వేల జరిమానా విధించనున్నారు.
