పాట్నా: బీహార్ ప్రభుత్వం రేపు గాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ హర్యాలీ అభియాన్ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసింది. అయితే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, 12 జిల్లాల్లో వరద ముంచెత్తడం, పాట్నా రోడ్లపై నీరు నిలిచి సముద్రాన్ని తలపిస్తుండటంతో రేపటి కార్యక్రమాలను బీహార్ ప్రభుత్వం రద్దు చేసింది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో సహా చేపట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లలో గాంధీ జయంతి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
