Breaking News
Home / Film News / అందరినీ ఆకట్టుకుంటున్న అనూప్ సంగీతం….

అందరినీ ఆకట్టుకుంటున్న అనూప్ సంగీతం….

ఫిల్మ్ న్యూస్: హీరో కార్తికేయ కొత్త చిత్రం 90మ్ల్ లోని మొదటి పాట “ఇనిపించుకోరు ఇనిపించుకోరు” ఇటీవల విడుదలై అబ్బాయిలకి తెగ నచ్చింది. “ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు” అంటూ సాగే ఈ పాట అమ్మాయిల ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాయిలందరి మాటలుగా రాహుల్ సిప్లిగంజ్ గాత్రంలో, చంద్రబోస్ సాహిత్యంలో, అనూప్ రూబెన్స్ సంగీతంలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్‌ని ఆకట్టుకుంది.`ఆర్ ఎక్స్ 100` వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ `90 ఎం.ఎల్‌` సినిమా నిర్మిస్తున్నారు.

దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ పాట గురించి మాట్లాడుతూ “ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవదాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు అయ్యాడు అన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది? ఇందులో యూత్ కి మాత్రమే కాక ఫామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి“ అన్నారు. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ “ ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్ బైజాన్ రాజధాని బాకు వెళ్తున్నాం.అనేక బాలీవుడ్ చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల మన భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి ” అని తెలిపారు .

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *