Breaking News
Home / World News / తండ్రికి అంత్యక్రియలు..శవపేటిక నుంచి మాటలు రావడంతో అందరూ షాక్!

తండ్రికి అంత్యక్రియలు..శవపేటిక నుంచి మాటలు రావడంతో అందరూ షాక్!

కిర్‌కెన్లీ(ఐర్లాండ్): “నేను బ్రాడ్లీని..ఎవరైనా ఉన్నారా, ఇంత చీకటిగా ఉందేంటి? నన్ను బయటకు వదలండి..”ఇవి షే బ్రాడ్లీ అంత్యక్రియల్లో పాల్గొన్న వారు విన్న మాటలు. శవపేటిక నుంచి ఈ శబ్దాలు రావడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అంతా నవ్వుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్‌‌కు చెందిన షే బ్రాడ్లీ(62) అనే వ్యక్తి ఇటీవలే మరణించాడు. అతడు గతంలో మిలటరీ అధికారిగా సేవలందించాడు. బ్రాడ్లీ పరిచయస్తులందరూ అతడిని సరదా వ్యక్తి అంటూ తెగ పొగిడేవారు. అతడి ప్రాక్టికల్ జోకులకు ఎవ్వరైనా దిమ్మెరపోవాల్సిందే. బ్రాడ్లీ ఉన్న చోట నవ్వులు పూయాల్సిందే- ఇదీ స్నేహితులు, బంధువుల మధ్య బ్రాడ్లీకి ఉన్న పాపులారిటీ.

అయితే తను చనిపోయాక ఎవరూ బాధపడకూడదనేది బ్రాడ్లీ కోరిక. ఇదే విషయాన్ని సంతానానికి చెప్పాడు. అంత్యక్రియల్లో చిన్న ప్రాక్టికల్ జోక్ వేద్దామన్నాడు. బ్రాడ్లీ సంతానం ఇందుకు సరేనన్నారు. ఆ తరువాత తను చెప్పాలనుకున్న మాటలను బ్రాడ్లీ రికార్డు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా..శవపేటిక కోసం తవ్విన గోతిలో బ్రాడ్లీ సంతానం ఎవరికీ తెలీకుండా ఓ స్పీకర్‌ను అమర్చారు. భూమిలోకి కాఫిన్‌ను దించుతున్న సమయంలో ఈ శబ్దాలు రావటంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాకయ్యారు. కాఫిన్‌లో బ్రాడ్లీ నిజంగా మాట్లాడుతున్నాడా అనుకుంటూ కంగారు పడిపోయారు. కాసేపటి తరువాత బ్రాడ్లీ చివరి కోరిక గురించి తెలుసుకుని వారందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బాడ్ల్రీ చివరి జోక్ అదిరిపోయిందంటూ చప్పట్లు కొట్టారు. అతడి కోరిక ప్రకారం వారందరూ చిరునవ్వులు చిందిస్తూ తిరుగు ప్రయాణమయ్యారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *