Breaking News
Home / National / ఈ యాప్ ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి….

ఈ యాప్ ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి….

న్యూఢిల్లీ : దేశంలో మహిళల భద్రత కోసం సరికొత్త యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన లోకసభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అత్యవసర సమయాల్లో స్పందించే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని అన్నారు. దేశ ప్రజలంతా ‘112 ఇండియా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, దేశంలో బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు ఈ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చాయని చెప్పారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఎక్కడ ఉన్నారు? వారిని చేరుకోవటానికి ఉన్న మార్గాలేమిటో తెలుస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ యాప్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *