Breaking News
Home / States / ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించాలి..

ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించాలి..

రాజోలు : జిఎంసి బాలయోగి స్ఫూర్తితో టీడీనీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. బాలయోగి 68 వ జయంతి సందర్భంగా.. మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజోలు కాటన్‌ పార్కులో బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత బాలయోగి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శవంతమైన నేతగా బాలయోగి ఎదిగారని, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేమన్నారు. ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించాలని సూచించారు. పుట్టిన ప్రతీ మనిషి మరణించడం ఖాయమని, కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అలాంటి అరుదైన వ్యక్తుల్లో బాలయోగి ఒకరని కొనియాడారు. బాలయోగి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, నేటి రాజకీయ నాయకులు ఆయన్ని రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *