Breaking News
Home / States / మేళ్లచెరువులో నిలిచిన పోలింగ్…

మేళ్లచెరువులో నిలిచిన పోలింగ్…

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మేళ్లచెరువులోని 133 పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దాని స్థానంలో ఏర్పాటు చేసిన మరో ఈవీఎం కూడా మొరాయించడంతో ప్రస్తుతానికి అధికారులు పోలింగ్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం మొత్తం 302 పోలింగ్‌ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *