ఏలూరు: గత ప్రభుత్వం వల్లే ఆర్థిక వ్యవస్థ బాగోలేదని మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను టీడీపీ పార్టీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇసుకను విశాఖకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక కొరత వల్లే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. జగన్ స్టిక్కర్లతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ధ్వజమెత్తారు.
