విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు కృషి కార్యకర్తల్లో ధైర్యం నింపుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం తర్జన భర్జనగా ఉందన్నారు. కేసుల్లో నేరస్తులు, తెలంగాణ ద్రోహులు నేడు ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉండడం బాధాకరమని విమర్శించారు. సీఎం కేసీఆర్కు జగన్ దాసోహం చేస్తున్నారని, ఏదో ఒక రోజు జగన్ జైలుకెళ్లడం ఖాయమని సత్యనారాయణమూర్తి జోస్యం చెప్పారు.
