Breaking News
Home / States / Andhra Pradesh / వ్యాయామం జీవనశైలిలో భాగం కావాలి

వ్యాయామం జీవనశైలిలో భాగం కావాలి

డెల్టా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

రాజమహేంద్రవరం: వైద్యం చేసేవాడు నారాయణుడితో సమానమని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన వెంకయ్య..డెల్టా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో అనేక విద్యాలయాలు, వైద్యశాలలు వచ్చాయన్నారు. నైపుణ్యం కలిగిన వైద్యులతో ఆసుపత్రి ఏర్పాటైందని చెప్పారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్యం బాగుంటే భాగ్యాన్ని సాధించవచ్చని సూచించారు.

శారీరక, మానసిక ఆరోగ్యం.. రెంటి మధ్య సమతుల్యం సాధించాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి జీవనశైలి అలవర్చుకోవాలన్నారు. రొటీన్‌ ఫుడ్‌లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలని, ప్రతి ఒక్కరి జీవనశైలిలో వ్యాయామం భాగం కావాలని చెప్పారు. శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రశాంతత కోసం ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఏకాగ్రత కోసం యోగా వంటివి సాధన చేయాలని తెలిపారు. పాశ్చాత్య వ్యామోహంతో జంక్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ వైపు మళ్లుతున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *