Breaking News
Home / National / హుబ్లీ రైల్వేస్టేషన్‌లో పేలిన బాక్స్….

హుబ్లీ రైల్వేస్టేషన్‌లో పేలిన బాక్స్….

హుబ్లీ: కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో బాక్స్‌ పేలింది. ఈ ఘటనలో హుస్సేన్‌ సాబ్‌ నాయక్‌వాలె అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. హుస్సేన్‌ పట్టుకెళ్తున్న బాక్స్‌ పేలి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలిన బాక్స్‌ కాన్పూర్‌ ఎమ్మెల్యే పేరుతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *