Breaking News
Home / National / న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…

న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…

 న్యూజిలాండ్ : న్యూజిలాండ్ దేశంలోని వైట్ ఐలాండ్‌లో సోమవారం అగ్నిపర్వతం పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తర ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలోని వైట్ ఐలాండ్ ద్వీపంలో అగ్నిపర్వతం పేలి కొంత మంది గాయపడ్డారని మేయర్ జూడీ టర్నర్ చెప్పారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల గాయపడిన వారిని సురక్షితంగా తీసుకువచ్చి వారిని ఆసుపత్రిలో చికిత్స అందించడంపై దృష్టి సారించామని మేయర్ పేర్కొన్నారు. అగ్నిపర్వతానికి దూరంగా ఉన్న తీరప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని మేయర్ వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *